Naalona Neevu / నాలోన నీవు నేలోన నేను కలకాలం నిలవాలని Song Lyrics
Telugu Christian Latest Popular Songs Lyrics 2023
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
Song Credits:
Lyrics & Tune : Pastor K Chinnababu
Music Composer : Bannu
Lyrics:
పల్లవి :
[ నాలోన నీవు నేలోన నేను
కలకాలం నిలవాలని
ఆశించుచున్నది నా మది
నిత్యము నీతోనే గడపాలని ] (2)
[ నివు లేక క్షణమైనా నేనుండలేను
ప్రభువా నా ప్రభువా ] (2) |నాలోన నీవు|
చరణం 1 :
[ నా గానం నా ధ్యానం నీవే దేవా
నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా ](2)
[ మలినమైన నా హృదిని మార్చింది నీవే
నూతనమగు సృష్టిగా చేసింది నీవే ] (2)
[ ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా ] (2) |నాలోన నీవు|
చరణం 2 :
[ వేదనలో ఆదరణ నీవే దేవా
ఒంటరినై వున్నప్పుడు జతనీవే ప్రభువా ] (2)
[ పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే
ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే ] (2)
[ ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా ] (2) |నాలోన నీవు|
చరణం 3 :
[ నాకై మరణించింది నీవే దేవా
నా పాపం తుడిచింది నీవే ప్రభువా ] (2)
[ శిధిలమైన నన్ను నిలబెట్టింది నీవే
మధురమైన వాక్యంతో కట్టింది నీవే ] (2)
[ ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా ] (2) |నాలోన నీవు|

0 Comments