Visiri Velli /విసిరీ వెళ్ళి Song Lyrics
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Singer :Yamini garu
Music Director :Prasanth garu
Producer : క్రీస్తు సంఘం-తిరువూరు
Lyrics:
పల్లవి :
[ విసిరీ వెళ్ళి తిరిగిరాని గాలివి
కనిపించీ మాయ మయ్యె ఆవిరివి
ఉదయించీ అస్తమించె సూర్యుడివి
ప్రభుయేసుని నమ్ముకొంటె ధన్యుడివి ]|2|
[ ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు ]|2|విసిరీ వెళ్ళి |
చరణం 1 :
[ విత్తుట కోయుట ఎరుగని పక్షికి లోటేముంది
ఎండకు వానకు అడివిలో జీవికి భయమేముంది ]|2|
[ బ్రతకటానికి మనిషిచింత బహు వింతగ ఉందీ
పగలు రాత్రులు పని చేసినా ఫలితము ఏముంది ]|2|
[ ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు ]|2|విసిరీ వెళ్ళి |
చరణం 2 :
[ కలిమి ఉంటె చెలిమి చేసే లోకములో
నీ దీన స్థితిలో దిక్కుగ నిలిచే వారెవ్వరు ]|2|
[ దీనులతో ధనికులు స్నేము చేసెదరా
నిను ప్రేమించుటలో యేసుకు సాటి లేరుకదా ]|2|
[ ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు ]|2|విసిరీ వెళ్ళి |
చరణం 3 :
[ అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమూ
ఇంటినిండా ధనరాశులున్నా చాలును అనము ]|2|
[ నీ ప్రాణం ఉంటే పట్టు బట్టకు విలువుంటుందీ
నీవే లేని వజ్రము అయినా వట్టిదే అవుతుంది ]|2|
[ ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు ]|2|విసిరీ వెళ్ళి |
Full Video Song
Search more songs like this one

0 Comments