Deva Deva / దేవా..దేవా.. Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Vocals : Irene and Jeslene
Lyrics: Sahithiratna Dr. Akumarthi
Daniel Strings : Balaji group, chennai
Flute : Ramesh, chennai
Lyrics:
పల్లవి :
దేవా..దేవా.. - నా దైవమా..
అబ్బా తండ్రీ - నా జీవమా..
[ కంటికి పాపలా కాపాడుచుంటివే
కాపరి నీవై నడిపించు చుంటివే ]|2|
ఊహించ తరమా నీదు ప్రేమను
వర్ణింప తరమా నీదు కృపలను
ఏమందును నే నేమందును
చాచిన నీ బాహువులో దాగియుందును||దేవా..దేవా.. ||
చరణం 2 :
క్షామకాలమున నను తృప్తిపరచావు
నాదు హృదయమును బలపరిచావు
లోకాశలలో జారకుండునట్లు
నీవే నా మదిలో నిండిపోయావు
నీదు ప్రేమతో నన్ను చేరదీసి
నాలో భయములన్ని పారద్రోసి
క్షణమైనా నను వీడక
వెన్నంటి ఉన్న నాన్నవు||దేవా..దేవా.. ||
చరణం 2 :
నీటి కాలువల యోరను నాటితివి
తగిన కాలమందు ఫలియించుటకు
సింహపు పిల్లలు ఆకలిగొని యున్నను
నీ బిడ్డలను నీవు పోషించెదవు
నా చీకటిని వెలుగుగా చేసితివి
నన్నే లోకానికి వెలుగని అంటివి
నా వూపిరి కడవరకూ
నీ సాక్షిగా జీవింతును||దేవా..దేవా.. ||
Full Video Song
0 Comments