Neevichinadhey / నీవిచ్చినదే Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Vocals : Sis Raji Lekhana
Music & Tune: Bro Sunil Garu
Tabala: Bro Paul Raj HYD
Flute : Bro Srinivasu HYD
Lyrics:
పల్లవి :
[ నీవిచ్చినదే ప్రభువా ఈ బ్రతుకు
బ్రతికించినది స్తుతి పాడుటకు ](2)
[ యోగ్యుడవు నీవే ఆరాధనకు
స్తుతులర్పించెద నీ మేలులకు ](2)
[ స్తుతులకు పాత్రుడా
మా స్తోత్రార్హుడగు దేవుడా ](2) ॥నీవిచ్చినదే॥
చరణం 1 :
[ నే నడచిన ప్రతి స్థలమున - నీ సన్నిధి నాకు తోడుంచితివి
నే ప్రార్థించిన క్షణమున - నాకు ఆశ్చర్యకార్యాలు చేసితివి ](2)
[ నా ముందుండి కాచితివి ](2)
[ ఆపద రాకుండా చూచితివి ](2)
[ స్తుతులకు పాత్రుడా
మా స్తోత్రార్హుడగు దేవుడా ](2) ॥నీవిచ్చినదే॥
చరణం 2 :
[ నే భయపడిన దినమున - నీ ముఖదర్శనమిచ్చి బలపరచితివి
నీ రూపులో మార్చుటకై - పుటము వేసి నను కాల్చితివి ](2)
[ శాశ్వత ప్రేమను చూపితివి ](2)
[ ఆయుష్కాలము పొడిగించితివి ](2)
[ స్తుతులకు పాత్రుడా
మా స్తోత్రార్హుడగు దేవుడా ](2) ॥నీవిచ్చినదే॥
చరణం 3 :
[ నే అలసిన సమయమున - నా ప్రతి ఆశను తీర్చితివి
నాకు గాయములు చేసినా - నీవే నెమ్మదినిచ్చి మాన్పితివి ](2)
[ మాటనిచ్చి నెరవేర్చితివి ](2)
[ నీ కృపతో నను కాచితివి ](2)
[ స్తుతులకు పాత్రుడా
మా స్తోత్రార్హుడగు దేవుడా ](2) ॥నీవిచ్చినదే॥
Full Video Song
0 Comments