Preminchi Nannu / ప్రేమించి నన్ను Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Composed & Music Arranged by : Pranam Kamlakhar
Vocals : Hemant Brijwasi
Lyrics:
పల్లవి :
[ప్రేమించి నన్ను నా ప్రియ యేసు]|2||
[ నీ ప్రేమలోనే నడిపించినావు ]|2|
దర్శించి నన్ను దీవించినావు
కరుణించి నన్ను కాపాడినావు
ఏ రీతి నిన్ను సేవింతునయ్యా
నా యేసు నిన్నే పూజింతునయ్యా||ప్రేమించి నన్ను||
చరణం 1 :
మార్గము నీవే - క్షేమము నీవే - చల్లగ చూసే - దేవుడ నీవే
ఈ బ్రతుకంతా - నీ పద చెంత - నా ప్రభు నీవే - అణువణువంతా
నీ కృపలోనే - నా బలమంతా - కాపరి నీవే ప్రభూ
నీ దయలోనే - జీవితమంతా - నా గురి నీవే ప్రభూ
నా గురి నీవే ప్రభూ||ప్రేమించి నన్ను||
చరణం 2 :
కొండలలోన - లోయలలోన - అండగా నీవై - నడిపిన దేవా
వేదనలోన - శోధనలోన - తోడుగా నీవై - నిలచిన దేవా
ఉన్నతమైన - నీ ఘనకార్యం - ఏమని వివరింతును
ఆశ్రయమైన - నీ సన్నిధానం - ఎంతటి నా భాగ్యము
ఎంతటి నా భాగ్యము||ప్రేమించి నన్ను||
Full Video Song
0 Comments