దేవుని ఇష్టం / Devuni Ishtam Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics & Tunes: Br. Pastham Srinivas garu
Music: Br. Ashirvad Luke garu
Vocals: Sireesha Bhagavatula
Lyrics:
పల్లవి :
[ పరమున ఉన్న యెహోవా దేవా
పరిశుద్ధుడవు నీవే కాదా ]|2|
మేము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నావు నీవు
కల్మషం లేని కనికరము కలిగి బ్రతకాలనుకున్నావు
మా బ్రతుకులోన నీ పనులు చేస్తూ జీవించాలనుకున్నావు
మా శరీరం నీకు సమర్పించి
తలవాల్చాలని కోరుకున్నావు|| పరమున ఉన్న||
చరణం 1:
బలి అర్పణయు నీవు కోరలేదు
దహన బలులు నీకు ఇష్టమైనవి కావు
[ గ్రంథపు చుట్టలోనా నన్ను గూర్చి వ్రాయబడిన ]|2|
నా శరీరం నీకు సమర్పించి
సజీవ యాగముగా నీకు అంకితం చేసి
నా గుండెలోన నీ ఆజ్ఞలు ఉంచి
నీ శాసనాలను నేను పాటించి
నీ కోరికలను నేను నెరవేర్చినవా డనై
నీ చిత్తమును నేను అనుసరించిన వాడనై
నీ ఉద్దేశములను నేను చేపట్టినవాడనై
నీ నిబంధనలను నేను పాటిస్తూనే జీవించాలని... " పరమున ఉన్న "
చరణం 2:
పూర్ణ హోమములు నీకు ఇష్టమైనవి కావు
పాప పరిహారార్థ బలులు కోరనేలేదు
విరిగిన నలిగిన మనసు నీకు ఇష్టమైనది
పరిశుద్ధత పవిత్రత నీవు కోరుకున్నది
జీవితం నీకు ప్రాణార్పణగా శరీరం నీకై నలగాలని
నోటి ప్రతి మాట నీకై ఉండుటకు
నా అవయవాలు నీకై పని చేయాలని
నీ అనాది సంకల్పంలో నేను ఉన్నానుగా
జగత్తు వెయ్యక ముందే కోరుకున్నావుగా
సత్క్రియలను చేయడానికి నన్ను పంపించావని
నీ నామ స్మరణతో తనువును చాలించి వెళ్ళాలని... " పరమున ఉన్న "
Full Video Song
0 Comments