NEE PREMALO PRAYANAME / నీ ప్రేమలో ప్రయాణమే Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Music : Pranam Kamlakhar
Vocals : Yasaswi Kondepudi
Lyrics:
పల్లవి :
[నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే]|2|
నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం
సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
సదా నిన్ను కొనియాడనా
నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే
ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా
చరణం 1 :
నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా
కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే
దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా
నా త్రోవలో నీడగా||నీ ప్రేమలో ప్రయాణమే||
చరణం 2 :
నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై
ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో
నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన
చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో
దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా
నా గమ్యమే నీవయా||నీ ప్రేమలో ప్రయాణమే||
Full Video Song
0 Comments