నేను పుట్టింది నా తండ్రి కొరకే / Nenu Puttindi Naa Thandri Korake Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Saahithi Chaaganti
Lyrics:
పల్లవి :
నేను పుట్టింది నా తండ్రి కొరకే
నేను బ్రతకాలి తన కీర్తి కొరకే
నేను చేయాలి ఆ తండ్రి పనులే
తిరిగి చేరాలి తానున్న స్థలమే
జగతికి ముందే ఏర్పరచి - గ్రంధపు చుట్టలో నను చేర్చి
పిండపు దశలో నను చూసి -కనుపాపవలె నను కాచీ.....
"నేను పుట్టింది "
చరణం 1 :
[ సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపెనుగా
అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనెగా ](2)
రంగుల పూవులు తీయని కాయలు నా సంతోషం కొరకైతే
తెలిసిన నేను తెలియని వారికి దేవుని ప్రేమను తెలుపుటకే ...
"నేను పుట్టింది"
చరణం 2 :
[ నే తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియునుగా
అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా ](2)
నేనే మార్గము సత్యము జీవము అంటూ నన్నే మార్చేనుగా
మరువని త్యాగం చేసి నన్నే తండ్రికి చేరువ చేసేనుగా ...
నేను పుట్టింది నా తండ్రి కొరకే
ఇకపై బ్రతికెదను తన కీర్తి కొరకే
ఇలలో చేసెదను నా తండ్రి పనులే
తిరిగి చేరెదను తానున్న స్థలమే
జగతికి ముందే ఏర్పరచి - గ్రంధపు చుట్టలో నను చేర్చి
పిండపు దశలో నను చూసి -కనుపాపవలె నను కాచీ.....
"నేను పుట్టింది "
0 Comments