Raraju Puttadoi / రారాజు పుట్టాడోయ్ Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Joshua Shaik
Pranam Kamlakhar|
Aniirvinhya & Avirbhav|
Telugu Christmas Song 2023
Lyrics:
పల్లవి :
[ రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ]|2|
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ ...|| రారాజు పుట్టాడోయ్||
చరణం 1 :
వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై .....|| రారాజు పుట్టాడోయ్||
చరణం 2:
మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై .....|| రారాజు పుట్టాడోయ్||
Full Video Song
0 Comments