JEEVADAATHA / జీవదాత Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music Composed and Arranged by Pranam Kamlakhar
Vocals : Aniirvinhya & Avirbhav
Flute : Mahati
Violin : Kamakshi
Veena : Charulatha Chandrasekar Vaidehi Balasubramanian
Lyrics:
పల్లవి :
[ జీవదాత స్తుతిపాత్రుడా ]|2|
నన్నేలు దేవా నజరేయుడా
జీవదాత స్తుతిపాత్రుడా
నన్నేలు దేవా నజరేయుడా
ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా
నీవు లేక ఇలలో నేను బ్రతుకలేను నిజ దేవుడా
జీవదాత స్తుతిపాత్రుడా
నన్నేలు దేవా నజరేయుడా
ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా
అంధకార ఈ జగాన నీవే చాలు నా యేసయ్య||జీవదాత||
చరణం 1 :
లోక ప్రేమలు - నను వీడినా
విరిగి నలిగి వేసారినా
ఎదురుగ - నిలచిన - ప్రేమే నీవు - ఎడబాయవు
గాలి వానలు చెలరేగినా
కృంగి నేను పడిపోయినా
అలలలో - మరువని - ఆశే నీవు - విడనాడవు
యేసయ్యా - నీ స్నేహమే
యేసయ్యా - నా భాగ్యమే
చల్లగా - చూసావుగా
ధరలో - సుఖమై - వరమై నా తల్లిగా
చెరలో - బలమై - నిలిచే నా తండ్రిగా||జీవదాత||
చరణం 2 :
నీదు మార్గము - పరిపూర్ణము
ఇలలో నాకు - జయగీతము
అనిశము - అభయము - నీవే దేవా - పరమాత్ముడా
నీదు నామము - అతి శ్రేష్టము
పలికె నాలో - స్తుతి గీతము
మహిమయు - ఘనతయు - నీకే దేవా - పరిశుద్ధుడా
యేసయ్యా - నీ వాక్యమే
యేసయ్యా - ఆధారమే
ప్రేమతో - కోరానుగా
కృపతో - చెలిమై - మలిచే నా బంధమా
మదిలో - కొలువై - నిలిచే ఆనందమా||జీవదాత||
Search more songs like this one
0 Comments