NAA NEETHI SURYUDA / నా నీతి సూర్యుడ Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music Director : Bro KY Ratnam
Vocals : Anwesshaa
Lyrics:
పల్లవి :
[ నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ]||2||
[ స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ]||2||
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ
చరణం 1 :
[ మనుష్యుని నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి
నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి ]|2||
[ నీ మార్గము చూపించి నీ చెంతకు నడిపించి ]||2||
[ నీ నీతితొ నను నింపి నీ దర్శనమియ్యుమయ ]||2||
[ స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ]||2||
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ||2||
చరణం 2 :
[ పరిసయ్యుని స్వనీతి ప్రార్ధన దేవుని మెప్పించలేదు
హృదయమున గర్వించి పాపముతొ మిగిలిపోయెను ]|2||
[ సుంకరి ప్రార్ధన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి ]|2||
[ నీ నీతిని పొందుకొనే హృదయమును ఇయ్యుమయా ]||2||
[ స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ]||2||
[ నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ]||2||
చరణం 3 :
[ నీతిలేని ఈలోకాన నీతిలేని మనుష్యుల మధ్య
నీ నీతిని చూపించే జీవితమును కలిగియుందును ]|2||
[ నీ రక్తముతొ కడిగి నా పాపము తొలగించి ]||2||
[ నీ కృపతో దీవించి నీ నీతిని ఇయ్యుమయా ]||2||
[ స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ]||2||
[ నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ]||2||
[ స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ]||2||
[ స్తోత్రార్పణ నీకే తగునయా ] ||2||
0 Comments