ఎంత ప్రేమ నీదయా యేసయా / Yentha Prema Needayya Yesayya Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music: Jakie Vardhan
VOCAL; MERI BLESSY
Lyrics:
పల్లవి :
ఎంత ప్రేమ నీదయా యేసయా
ఇంతయని నేను వెలకట్టలేనయా
అంతులేని ప్రేమ నీది యేసయా
ఎంత పొగిడినా ఋణము తీరదయ్యా
[ యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుచుట సాధ్యమా వల్లకాదయా
ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను శాశ్వతమైనది వింతైనది ]|2|
"ఎంత ప్రేమ"
.
చరణం 1 :
[ లోకంలో ఎన్నో ప్రేమలున్ననూ
శోకంలో ఉండగా తోడుండవే
గాఢంగా ప్రేమించిన ప్రియులైననూ
చూడంగా కష్టాలలో దరి చేరరే ]|2|
స్థితి ఏదైనా విడువని ప్రేమ
మృతి వరకైనా తోడుండే ప్రేమ
ప్రతి క్షణం వెన్నంటి ఆదరించు ప్రేమ.. ఆదరించు ప్రేమ...
[ యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుచుట సాధ్యమా వల్లకాదయా
ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను శాశ్వతమైనది వింతైనది ]|2|
"ఎంత ప్రేమ"
చరణం 2 :
[ స్వార్థంతో నిండిన ఈ లోకంలో
స్వచ్ఛమైన ప్రేమను కనుపరచేదెవరు
చూచి చూడనట్లు నటించే ఈ భువిలో
వెదకి మరీ ప్రేమతో సంధించేదెవరు ]|2|
వెదకని ప్రజకు దొరికిన ప్రేమ
వ్యథలను తీర్చి రక్షించిన ప్రేమ
ప్రేమించి ప్రాణాన్ని అర్పించిన ప్రేమ ..అర్పించిన ప్రేమ....
[ యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుచుట సాధ్యమా వల్లకాదయా
ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను శాశ్వతమైనది వింతైనది ]|2|
"ఎంత ప్రేమ"
0 Comments