ఏమున్నది నాలో, EMUNNADI NALOO Lyrics
Album: Sannuti
Production: Show Christ Ministries
Production: Show Christ Ministries
Latest Telugu Christtian Songs 2024,
Song Credits:
Lyrics Written by : Bro. Anil Kumar Vemula
Music Composed by : Bro. Anil Ravada
Vocals : Dr. A.R. Stevenson, Dr. Nissi John
Music Composed by : Bro. Anil Ravada
Vocals : Dr. A.R. Stevenson, Dr. Nissi John
Lyrics:
పల్లవి :
[ ఏమున్నది నాలో ఓ యేసయ్య
మచ్చుకైన మంచి కానరాదయ్యా ]// 2//
[ ఎంతవెదకి చూచినా పాపమే గదయ్యా ] // 2 //
ఎందుకయ్య నాపై - నీకింత ప్రేమయ్యా
[ యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవ మార్గమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా ] // ఏమున్నది //
చరణం 1 :
నినుచూడ సాధ్యమేనా తేజోమయకరుణించి ననుచేరే నీదయ
వెలువడగా నీవాక్యం కనబడె నాపాపం
తడబడిన నా పాదం స్థిరపడె నీకోసం
[ క్షమియించి ఇచ్చావయ్యా నీకృపాక్షేమము
నన్నావరించెనయ్యా నీదువాత్సల్యము ]/2/
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవ మార్గమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //
చరణం 2 :
నీపైనే తిరుగుబాటు చేసానయ్యాతాలిమితో మన్నించే నీ దయ
శ్రమపడగా నీదేహం సరియాయెను సర్వం
కార్చితివి నీరుధిరం దొరికెను పరిహారం
[ నే తీర్చజాలనయ్యా నీ ఋణమే మాత్రము
సాక్షిగా నిలుతునయ్యా నా జీవితాంతము ]//2//
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవ మార్గమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //
చరణం 3 :
నిను వీడి పారిపోతి ప్రేమామయవిడువకయే నను వెదకే నీ దయ
వినబడగా నీ స్వరం పులకించెను దేహం
తెంచితివి బంధకం కలిగెను స్వాతంత్ర్యం
[ క్షణమైన విడువనయ్యా నీ సన్నిధానము
వివరింప జాలనయ్యా ఈ గొప్ప భాగ్యము ]\2\\
తనివితీరా అనుక్షణం నిన్నారాధింతును
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... నిత్యజీవమా
యేసయ్యా... నా దైవమా
యేసయ్యా... పరలోక ద్వారమా // ఏమున్నది //
0 Comments