Kshemamuga Unanaya / క్షేమముగా ఉన్నానయ్యా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics:
పల్లవి :
[ క్షేమముగా ఉన్నానయ్యా నీ దయవలనా
నెమ్మదినే పొందానయ్యా వాగ్దానముల వలనా ]|2|
నీ నిర్ణయాలతో ప్రతికీడు నుండి తప్పించి నా యేసయ్యా ॥2॥
మహిమతో నిండిన ప్రాణేశ్వర నా ఆనంద గానాలు నీకేనయ్యా
జీవితమంతా నీకంకితం
ఎదలో నిండిన నాయేసయ్యా ॥క్షేమముగా॥
చరణం 1 :
[ సామర్థ్యమును మించి ఊహల్లో ఊరేగి
రేపాను నీకోపమును నిండుగా
విశాల హృదయముతో ప్రక్షాళనము చేసి
ఆత్మతో నింపావు సర్వేశ్వర ]|2|
[ వ్యవసాయ మందలి పైరువలే
కాలువ యోరన వృక్షములా ] ॥2॥
వాడక నీ కొరకు ఫలియించెద. ॥మహిమతో॥
చరణం 2 :
[ నా సొంత తలంపు నీ చిత్తమేనని
హృదయమును ఒప్పించి జయమొందినా
ఆకాశమంతటి ఆటంకములను
పంపించి గెలిచావుజ్ఞానేశ్వర ]॥2॥
[ కురిసేటి ఆ మంచు బిందువులా
మేఘాలయందలి వర్షములా ]॥2॥
నీ నోటి మాటకు తలదించెదా॥మహిమతో॥
చరణం 3 :
[ నెలవైనవారు నా సాక్ష్యమును
తమ శైలిలో చెరిపి ప్రచురించినా
సంపూర్ణ దీవెన నా సొత్తు చేసి అహమంత
అణిచావు పరమేశ్వర ]॥2॥
[ సీయోనులోని పర్వతమై భువియందు దాగిన బంగారమై ]|2||
స్థిరముగ నీ కొరకు నే మెరిసెద ॥క్షేమముగా॥
0 Comments