Sthotramaya / స్తోత్రమయా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics:
పల్లవి :
[ స్తోత్రమయా నీ నామముకు వందనమయ్యా నీ పాదాలకు ]|2|
[ ఘననీయుడా నిన్నే ఘనపరతునూ సర్వశక్తుడా నిన్నే
కీర్తింతును..స్తుతియింతును ]|2|
పరిశుద్ధుడా పరమాత్ముడా నిన్నే ప్రకటింతును
బహుపూజ్యుడా బలవంతుడా నిన్నే భజియింతును || స్తోత్రమయా||
చరణం 1 :
యెహోవా మంచివాడు యెహోవా మనోహరుడు
యెహోవా మహానీయుడు యెహోవా మొదటివాడు
యెహోవా కడపటివాడు యెహోవా కాపాడువాడు
యెహోవా కృపగలవాడు యెహోవా కీర్తనీయుడు
యెహోవా ఆశ్చర్యకరుడు యెహోవా ఆరాధనకుయోగ్యుడు
యెహోవా ఆశీర్వదించువాడు యెహోవా ఆగోచరుడు
॥పరిశుద్ధుడా॥
చరణం 2 :
యెహోవా దవళవర్ణుడు యెహోవా దీర్ఘశాంతుడు
యెహోవా దయగలవాడు యెహోవా దరిచేర్చువాడు
యెహోవా నమ్మదగినవాడు యెహోవా న్యాయవంతుడు
యెహోవా నీతిమంతుడు యెహోవా నీతిసూర్యుడు
యెహోవా ఆత్మలకు దేవుడు యెహోవా ఆమేన్ అనువాడు
యెహోవా ఆదుకొనువాడు యెహోవా అతికాంక్షనీయుడు
॥పరిశుద్ధుడా॥
చరణం 3 :
యెహోవా వైద్యులకు వైద్యుడు యెహోవా వాత్సల్యపూర్ణుడు
యెహోవా విమోచకుడు యెహోవా వివేకవంతుడు
యెహోవా జీవించువాడు యెహోవా జీవాధారుడు
యెహోవా జ్ఞానవంతుడు యెహోవా జీతిర్మయుడు
యెహోవా ఆదిసంభూతుడు యెహోవా ఆధారభూతుడు
యెహోవా ఆదియునైనవాడు యెహోవా అంతమునైనవాడు
|| స్తోత్రమయా||
0 Comments