Nee Krupayega Maa Deva / నీ కృపయేగా మా దేవా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Vocals: Sharon Philip & Philip Gariki (@PhilipSharonGospelsingers )
Tune & Lyrics: Prabhod Kumar Adusumilli
Tabla & Dholak: Prasangi
Guitars: Keba Jeremiah (@kebajer )
Violin: Sandilya Pisapati (@SandilyaPisapati )
Flute: Srinivas Veena: Phani Narayana (@PhaniNarayana )
Lyrics:
పల్లవి :
[ నూతనపరచుము మము నడిపించుము
వాడబారని నీ కృపలో
మము పిలచినది ఇల నిలచునది
నీ కృపయేగా మా దేవా ]|2|
[ నీ కృపయేగా ఉత్తమము నీ కృపయేగా శాశ్వతము ]|2|
నీ కృపయేగా మా దేవా
చరణం 1 :
[ సొంతవారి ద్రోహమే గుంతలోకి నెట్టినా
నీతికి ప్రతిగా మేటి శ్రమ పుట్టినా ]|2|
[ ఒంటరి యోసేపుతో జంటగ నడచినది
కంటక స్థితినంత అడుగంట మాపినది ]|2|
నీ కృపయేగా మా దేవా
చరణం 2 :
[ కన్నవారి ధోరణే అడవిలోకి నెట్టినా
మేలుకు ప్రతిగా కీడు వెంబడించినా ]|2|
[ కాపరి దావీదును రాజుగ కోరినది
సంకటమంత బాపి కడు దీవించినది ]|2|
నీ కృపయేగా మా దేవా
చరణం 3 :
[ గడచిన కాలమే కలవర పెట్టినా
తలచిన రీతిగా సాగలేక పోయినా ]|2|
[ తదుపరి వత్సరము మేము కోరునది
మా బ్రతుకంతా కావలసినది ]|2|
నీ కృపయేగా మా దేవా
0 Comments