Lokapapumunu mosukelinaa devuni gora pilla / లోక పాపమును మోసుకెళ్లిన Song Lyrics
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
Song Credits:
Lyrics:
పల్లవి :
లోక పాపమును మోసుకెళ్లిన – దేవుని గొర్రెపిల్ల (2)
నీ రక్తమే పాప పరిహారం -నీ దేహమే జీవ ఆహారం
నీ వాక్యమే మాకు ఆధారం
నీ నామమే రక్షణకు మూలం
నీ విజయమే మాకును విజయం ||లోక పాపమును||
చరణం 1:
[ మొదటి ఆదాముతో – పాపము జనియి౦చెను
మరణము సంక్రమించెను ]||2||
ఆ పాపం పోవాలంటే – ఈ మరణం తోలగాలంటే
మా వల్ల కానెకాదు – పరిశుద్దుడె రావాలి….
ప్రభువా కదపటి ఆదామైనావు…
కలువరి బలిపీఠమునెక్కావు…
నీ ప్రాణమే బలిగా అర్పించి…
మా ప్రాణాలను కాపాడావు
మరణాన్నే మింగివేశావు || నీ రక్తమే||
చరణం 2 :
[ నీవు పొందిన దెబ్బలచె – మాకు స్వస్థత నిచ్చావే
మాకోసం చీల్చబడినావే…] ||2||
సూరూపమెమిలేక కురుపివైనావయ్యా
నిను నాలుగగొట్టుటకు తండ్రిష్టమాయెనా…
ప్రభువా నిశ్చయముగ మా రోగాలు…
భరీయించావు నీ దేహములో…
మా వ్వసనములన్నిటి సహీయించి…
మా శాపగ్రాహివైనావు
ఆరోగ్యమే మాకు ఇచ్చావు.. || నీ రక్తమే||
చరణం 3 :
[ శ్రీమంతుడవు నువ్వు – సృష్టంతటిలో నువ్వు
అయినా తగ్గించుకున్నావు ]… ||2||
నివు సృస్టించిన ఈ భువికి – దీనుడవై దిగివచ్చావే
మము ధనవంతులుగా చేయ – దారిద్ర్యతనొ౦దావె…
ప్రభువా నీ తగ్గింపుకు సమమెది?…
నీ అద్బుత క్రుపకు మితియేది?..
నీ ప్రేమకు ఇలలో సాటెది?…
నీవంటి రక్షకుడు ఏడి
నీ లాంటి ప్రేమ ఘనుడేడి.. || నీ రక్తమే||
0 Comments