MANASUNNA MANCHI DHEVAA | మనసున్న మంచిదేవా Song Lyrics
symphony music LYRICS
famous telugu christian songs LYRICS
Song Credits:
SONG : MANSUNNA MANCHI DEVA
ALBUM : NADIPISTHADU
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
Lyrics:
పల్లవి :
[ మనసున్న మంచిదేవా
నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై
మనిషిగా దిగి వచ్చావా ]|2||
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా ||మనసున్న మంచిదేవా||
చరణం 1 :
[ హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము ]|2||
[ మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా ]|2|| నా మది నీ కోవెలగా||
చరణం 2 :
[ చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను ]|2||
[ అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా ]|2|| నా మది నీ కోవెలగా||
చరణం 3 :
[ నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి ]|2||
[ పూర్ణశాంతిగలవానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా ]|2|| నా మది నీ కోవెలగా||
Search more songs like this one
0 Comments