NANU NAMMAKAMAINAVAANIGA / నన్ను నమ్మకమైన వానిగా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics:
పల్లవి :
[ నను నమ్మకమైన వానిగా ఎంచినందుకు
నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు ]|2|
కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా
నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా ||నను నమ్మకమైన||
చరణం 1 :
[ ఏ బాధ్యత నీవు నాకు అప్పగించినా
పని చేయుట కొరకు నన్నెక్కడుంచినా ]|2|
[ భారము భరించి రాత్రింబవలు శ్రమించి ]|2|
[ బహుమానము పొంద ఫలియించుతానయ్యా ]|2|
కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా
నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా ||నను నమ్మకమైన||
చరణం 2 :
[ లోకాశలు లాగివేయ ప్రయత్నించినా
చెలరేగిన శ్రమలు నన్నడ్డగించినా ]|2|
[ శోధన సహించి విశ్వాసముతో జయించి ]|2|
[ గురియొద్దకు చేర పరుగెత్తుతానయ్యా ]|2|
కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా
నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా ||నను నమ్మకమైన||
చరణం 3 :
[ ప్రోత్సాహము లేక ఆత్మ నీరసించినా
వ్యతిరేకుల క్రియలు నన్నేడిపించినా ]|2|
[ ఓపిక వహించి వాగ్దానముల స్మరించి ]|2|
[ పరలోకపు వ్యాప్తి జరిగించుతానయ్యా ]|2|
కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా
నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా ||నను నమ్మకమైన||
0 Comments